ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం: ఎన్ఆర్ఐ సుహసిని మృతి
- August 30, 2017
హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో ఇండియాకు చెందిన కేశపల్లి సుహసిని మరణించింది. అయితే ఈ ప్రమాదం నుండి ఆమె ఏడేళ్ళ కొడుకు సరక్షితంగా బయటపడ్డాడు.సుహసిని మృతదేహన్ని హైద్రాబాద్‌కు రప్పించేందుకు తెలుగు సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
హోండా సివిక్ కారులో న్యూ టంపా రోడ్డు మీదుగా సుహసిని ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. సుహసిని ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఆమె ఏడేళ్ళ కొడుకు సుచీర్ బొజ్జ స్వల్పగాయాలతో ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. స్థానికులు అతడిని టంపా ఆసుపత్రికి తరలించారు.ఒక్కరోజు చికిత్స తర్వాత సుచీర్ బొజ్జను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. లేక్‌ల్యాండ్ నుండి ఇటీవలే సుహసిని కుటుంబం టంపాకు వచ్చినట్టు సుహసిని భర్త సురేష్ చెప్పారు.
సుహసిని స్నేహితులు విరాళాల వసూలు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో సుహసిని చురుకుగా పాల్గొన్నారని స్నేహితులు గుర్తుచేస్తున్నారు.
సుహసిని సహకారంతోనే ఈ విరాళాల సేకరణ ఊపందుకొన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
నార్త్ అమెరికన్ తెలుగు సోసైటీ, ఆమె స్నేహితులు సుహసిని భౌతికకాయాన్ని ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదం గత శుక్రవారం నాడు చోటుచేసుకొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







