అదరగొట్టే మేకోవర్ తో వస్తున్న రామ్
- August 30, 2017
గత ఏడాది జనవరిలో హిట్ కొట్టిన 'నేను శైలజ' కాంబినేషన్ ఈసారి దసరాను టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో అతి త్వరలో విడుదల కానుంది.
'నేను శైలజ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత హీరో రామ్ దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి కథానాయికలు కాగా స్రవంతి రవికిశోర్, పి.ఆర్.సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ జరిగే ఊటీ షెడ్యూల్తో టాకీ పార్ట్ పూర్తి కానుంది.
ఊటీ షెడ్యూల్తో 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం పూర్తి కానుంది. ఓ పాట మాత్రం చిత్రీకరించాల్సి ఉందట. ఇటలీలో ఈ పాటను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా త్వరలో ఆడియోను విడుదల చేసి సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట.
'నేను శైలజ' తర్వాత మరోసారి కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న తనకు మరో హిట్ ఖాయమంటున్నాడు రామ్. మరి రామ్ నమ్మకాన్ని ఈ సినిమా ఎంత వరకూ నిలబెడుతుందో చూడాలి..!
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







