సవాళ్ళను అధిగమించేందుకు సహకారం అవసరం
- August 30, 2017
మనామా: బహ్రెయిన్ ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, తీవ్రవాదం సహా పలు అంశాల్లో అరబ్ సమాజం నుంచి దక్కుతోన్న సహకారం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సహకారం మరింతగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. తీవ్రవాదాన్ని అణచివేయడానికి ఉమ్మడి పోరు అవసరమని అభిప్రాయపడ్డారు ప్రిన్స్ ఖలీఫా. అరబ్ సమాజానికి సంబంధించినంతవరకు ఏ దేశానికైనా సహాయ సహకారాలు అందించేందుకు బహ్రెయిన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారాయన. పరస్పర సహకారంతో అనేక అంశాల్లో ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుందనీ, స్థిరమైన అభివృద్ధి సాధించే క్రమంలో అసాంఘీక శక్తుల్ని ఖచ్చితంగా అణచివేయాల్సి ఉంటుందని ప్రిన్స్ ఖలీఫా చెప్పారు. అరబ్ సహకార బంధం భవిష్యత్తులో ఇంకా ధృఢమవుతుందనే ఆశాభాం వ్యక్తం చేశారాయన.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







