దుబాయ్ స్ట్రీట్ క్లీనర్స్ - కూలింగ్ కాలర్స్
- August 30, 2017
దుబాయ్: స్ట్రీట్ క్లీనర్స్, సరికొత్త పద్ధతుల్లో సమ్మర్ హీట్ నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొత్తగా ప్రవేశపెట్టినకూల్ గేర్ ద్వారా వారికి ఎండ వేడిమి, ఉ్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ - దుబాయ్ మునిసిపాలిటీ ఈ మధ్యనే కూలింగ్ కాలర్స్ని క్లీనర్స్కి అందించడం జరిగింది. గురువారం మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో మెజైరా ప్రాంతంలో 48.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ నేపథ్యంలో కూలింగ్ కాలర్స్, స్ట్రీట్ క్లీనర్స్కి ఎంతో ఉపయోగపడ్తున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 4,000 కూలింగ్ కాలర్స్ని, వారికి అందించారు. నెక్ ఏరియాని ఈ కూలింగ్ కాలర్స్ కవర్ చేస్తాయి. నెక్, చెస్ట్ మరియు అప్పర్ నెక్ ప్రాంతంలో వీటి కారణంగా ఉష్ణోగ్రతలు అదుపులో ఉండి, చల్లదనాన్ని ఇస్తాయి. నాలుగు నుంచి ఆరు గంటలపాటు ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వీటిని రిఫ్రిజిరేటర్లలో పెట్టుకుని తిరిగి వాడుకోవచ్చు. ప్రతి కూలింగ్ కాలర్ రింగ్కీ వాడకందారు పేరుని రిజిస్టర్ చేశారు. తద్వారా ఇంకొకరు దాన్ని వినియోగించడానికి వీలుండదు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







