చిన్నపాటి నిర్లక్ష్యమే చైనాలో ఫ్లోర్‌లో కూరుకుపోయిన మహిళ

- August 30, 2017 , by Maagulf
చిన్నపాటి నిర్లక్ష్యమే చైనాలో ఫ్లోర్‌లో కూరుకుపోయిన మహిళ

చిన్నపాటి నిర్లక్ష్యమే.. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. చైనాలో ఓ మహిళ.. ఇలానే ఓ మెట్రో స్టేషన్‌లో నడుస్తూ.. పెను ప్రమాదంలో పడింది. షెన్జెన్‌ నగరంలో ఉన్న క్యుజు మెట్రో స్టేషన్‌లో ఎస్కలేటర్‌ ముందున్న ఫ్లోర్ పాడయ్యింది. దాన్ని రిపేర్ చేయకుండా అలానే వదిలేయడంతో.. అటుగా వచ్చిన ఓ మహిళ.. ఫ్లోర్‌లోకి కూరుకుపోయింది. ఆమె భర్త ఆ పాడైన ప్రాంతాన్ని చూస్తూ నడుస్తున్నప్పటికీ.. అతని భార్య ఏ మాత్రం పట్టించుకోకుండా నడుస్తూ.. అందులో పడింది. వెంటనే ఆమె భర్త.. చుట్టు పక్కల ఉన్న వాళ్లు స్పందించి.. ఆమెను పైకి లాగారు. ఊహించని ప్రమాదంతో ఆమె షాక్‌కు గురయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com