వరుణ్ తేజ హీరోగా డైరెక్టర్ తేజ కంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా
- August 31, 2017
తేజ కేవలం కథ, కధలోని బలం ని నమ్ముకొని హిట్ కొట్టిన దర్శకుడు. అంతేకాదు.. టాలీవుడ్ కు నూతన నటీనటులను పరిచయం చెయ్యడంలో ముందుండేవాడు.. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, రీమాసేన్, సదా వంటి అనేకమంది నటీనటులను తెలుగు తెరకు పరిచయం చేశాడు.. చాలా కాలం గ్యాప్ తర్వాత రానా తో "నేనే రాజు నేనే మంత్రి" సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.. ఈ నేపద్యంలో తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టినట్లు.. అదీ మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...
కంచె సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టిన వరుణ్ తేజ్.. ఫిదా సినిమాతో బంపర్ హిట్ అందుకొన్నాడు.. తాజాగా తేజ కూడా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకొన్నాడు.. వీరిద్దరి కాంబోలో ఓ లవ్ స్టోరీని తెరకెక్కించే సన్నాహాల్లో తేజ ఉన్నట్లు టాక్.. ఇప్పటికే సినిమాకు కధ రెడీ చేసే పనిలో ఉన్నాడట.. తేజ.. ప్రస్తుతం వరుణ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సినిమా పూర్తి అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.. ఈ కాంబోలో సినిమాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









