మాస్క్‌లో దొంగతనం: శిక్ష తగ్గింపు

- September 01, 2017 , by Maagulf
మాస్క్‌లో దొంగతనం: శిక్ష తగ్గింపు

హై క్రిమినల్‌ కోర్ట్‌, మాస్క్‌లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ వ్యక్తికి ఆరు నెలల నుంచి మూడు నెలలకు జైలు శిక్షను తగ్గించింది. బుడైయాలోని అనాస్‌ ఇబ్‌న్‌ మాలిక్‌ మాస్క్‌లో డొనేషన్స్‌ కాజేసిన కేసులో దోషిగా తేలాడు ఓ వ్యక్తి. మాస్క్‌ నుంచి మెటల్‌ డొనేషన్‌ బాక్స్‌ గల్లంతయినట్లుగా బుడైయా పోలీస్‌ స్టేషన్‌లో ఇమామ్‌ ఫిర్యాదు చేయడం జరిగింది. బాక్స్‌లో 150 బహ్రెయినీ దినార్స్‌ ఉన్నట్లు ఇమామ్‌ ఫిర్యాదు చేశారు. మాస్క్‌ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు, ఇద్దరు వ్యక్తుల్ని నిందితులుగా గుర్తించారు. బహ్రెయిన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌కి చెందిన వ్యక్తి ఓ నిందితుడు కావడంతో అతన్ని మిలిటరీ కోర్టుకు అప్పగించారు. రెండో నిందితుడు, తన స్నేహితుడు మెటల్‌ బాక్స్‌తో తన వద్దకు వచ్చాడని, కాంక్రీట్‌ బ్లాక్‌తో దాన్ని బద్దలుగొట్టి, అందులోని 45 బహ్రెయినీ దినార్స్‌ని తీశాడని విచారణలో అంగీకరించాడు. ఫస్ట్‌ హై క్రిమినల్‌ కోర్టు ఈ కేసులో ఆరు నెలల జైలు శిక్షను రెండో నిందితుడికి విధించింది. అయితే ఆ రెండో నిండితుడు, అపీల్‌ కోర్టులో ఆ శిక్షను తగ్గించాల్సిందిగా కోరడంతో 3 నెలల జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com