అక్టోబర్ నాటికి యుఎఇ మరో రెండు ఫుడ్ బ్యాంక్ కొత్త శాఖలు ఏర్పాటు
- September 01, 2017
యుఎఇ ఆహార నిల్వ కేంద్రాలను అక్టోబర్ లో దుబాయిలో మరో రెండు ప్రదేశాలలో విస్తరించుకోవాలని నిర్ణయించింది. అంతేకాక 52 టన్నుల ఆహారాన్నివిరాళంగా అందజేయనుంది. ఎమిరేట్స్ లో సత్వా ,ముహిస్నాహ్ రెండు కొత్త శాఖలను ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్యం, భద్రత మరియు పర్యావరణ దుబాయ్ మునిసిపాలిటీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఖలీద్ మహ్మద్ షరీఫ్ అల్ ఆదిడి ధృవీకరించారు. కొత్త శాఖలలో ఆయా ఆహారాన్ని మొదటి శాశ్వత స్పాన్సర్ ఈసా సలేహ్ అల్ గుర్గ్ ఛారిటీ ఫౌండేషన్ నిర్వహించనుంది.శాశ్వత స్పాన్సర్షిప్ కోసం మరిన్ని అభ్యర్థనలు మునిసిపాలిటీకి వచ్చాయి వారిని ప్రస్తుతం వారిని అధ్యయనం చేస్తున్నట్లు అల్ ఆదిడి చెప్పారు. శాశ్వత స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న భాగస్వామి, అటువంటి భాగస్వామి ఎంచుకున్న బ్యాంకు ప్రదేశంలో అన్ని ప్రక్రియలకు ఆర్థిక దృక్పథంలో బాధ్యత వహించాలి. ఆహార బ్యాంకు పనిచేసే కాలం వరకు, "మేము దీనికి స్పాన్సర్షిప్ వ్యూహం మరియు మార్గదర్శకాలను సృష్టించామని పౌర కమిటీ పేర్కొంది. ఏప్రిల్ 19 వ తేదీన ఆల్ ఖోజ్ ప్రాంతంలో మొదటి యుఎఫ్ ఫుడ్ బ్యాంక్ శాఖను ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలల్లో సమర్ధవంతంగా ఆయా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అల్ ఆదిడి పేర్కొన్నారు. మున్సిపాలిటీతో సంతకం చేసిన ఆహార సంస్థల నుంచి 52 టన్నుల ఆహార పదార్థాల విరాళాలను బ్యాంక్ విరాళంగా అందజేసింది.ఫుడ్ బ్యాంకులలో దాతలు ప్రముఖ హోటల్ చైన్స్, సూపర్‌మార్కెట్ మరియు హైపర్‌మార్కెట్ సమూహాలు, ఆహార కర్మాగారాలు మరియు ఎమిరాట్ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. అల్ క్వాజ్లోని లాటిఫా బింట్ హమ్దాన్ స్ట్రీట్‌లోని ఫుడ్ బ్యాంక్ ఆఫీసు ద్వారా వారి విరాళాలు సేకరించబడ్డాయి మరియు మునిసిపాలిటీతో భాగస్వామ్యంలో స్వచ్ఛంద సంస్థలచే తక్కువ ఆదాయం గల కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆయా ఆహారాన్ని పంపిణీ చేయబడతాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







