హరికేన్ బాధితులకు ట్రంప్ కోటి రూపాయల ఆర్ధిక సహాయం
- September 01, 2017
జల విలయానికి టెక్సాస్ వణికిపోయింది.. ఇంకా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.. అటు బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతుంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధితులకు మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.
దీనిని భారీ విపత్తుగా పరిగణిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా 6.4 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వనున్నారు. ఈ నిధులను వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు వినియోగిస్తారు. ఇక అమెరికా కాలమాన ప్రకారం శనివారం ట్రంప్ టెక్సాస్, లూసియానాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వాస్తవానికి మంగళవారమే టెక్సాస్‌కు వెళ్లినప్పటికీ వరద ఎక్కువగా ఉండటంతో అక్కడ పర్యటించలేకపోయారు. వరద బాధితులను పరామర్శించిన అనంతరం భారీ విరాళాన్ని ప్రకటించే అవకాశం కనబడుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







