తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు
- September 01, 2017
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. క్షేత్ర సంప్రదాయం ప్రకారం.. తొలుత పుష్కరిణి ఒడ్డుకు చేరుకున్న కోవింద్ దంపతులు... వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయం మహాద్వారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఆలయ పండితులు రాష్ట్రపతికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
సంప్రదాయ దుస్తుల్లో శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన కోవింద్ దంపతులు.. తొలుత ధ్వజస్తంభానికి మొక్కారు. అనంతరం వెంకటేశుని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు రాష్ట్రపతికి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, శేషవస్త్రం అందించారు. ఆశీర్వచనం పలికారు. రాష్ట్రపతితో పాటు చంద్రబాబు, నరసింహన్ కూడా శ్రీవారి సేవలో తరించారు.
రాష్ట్రపతి తిరుమల యాత్ర దాదాపు ముగిసిందనే చెప్పాలి. శ్రీవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించిన కోవింద్.. పద్మావతి గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకోనున్నారు. నిన్ననే పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న నేపథ్యంలో.. నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి.. ఢిల్లీ బయల్దేరనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమల, తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







