చేతన్ చీను "దేవదాసి" మోషన్ పోస్టర్ విడుదల
- September 01, 2017
రాజుగారి గది ఫేమ్ చేతన్ చీను, సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్ కలిసి నటిస్తున్న చిత్రం 'దేవదాసి' త్వరలో శ్రీ లక్ష్మీ నరసింహ సినీ చిత్ర బ్యానర్ లో ప్రారంభం కానుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్'స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి కథ మాటలు దర్శకత్వం మధురావు మాదాసు. ప్రస్తుతం ఎందరో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెండి తెరపై తమ అద్రృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా తోట. బాలకృష్ణ పనిచేస్తున్నారు. ఇతను గతంలో బాహుబలి 1 కు ఆపరేటివ్ కెమెరా మెన్ గా పని చేసి ఆ తరువాత ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ తీస్తున్న ఇంటర్నేషనల్ మూవీకి డీ.ఓ.పి గా పని చేసిన అనుభవం ఉంది. ఈ చిత్రానికి ఎడిటర్ గా ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతంరాజు గారు. సంగీతం 'యాజమాన్య', కొరియోగ్రఫీ శివశంకర్ మాస్టర్ మరియు విజయ్. రచనా సహకారం ఎ. వి. యస్. ఆదినారాయణ...
ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ మొన్న వినాయక చవితి పండుగ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేయటం జరిగింది. ఈ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మొట్టమొదటి సారిగా ఒక మోషన్ పోస్టర్ ను ప్రేక్షకులు దర్శకుడిని హీరో ని మెచ్చుకుంటూ రివ్యూస్ వ్రాయడం తెలుగు లో బహుశా ఇదే మొదటిసారి అనుకుంట. అయితే మోషన్ పోస్టర్ చివరిలో గజ్జెలు పట్టుకుని కూర్చున్న దేవదాసి పాత్ర పోషించిన అమ్మాయి ఎవరు అనేది చిత్ర యూనిట్ బహిర్గతం చేయకపోవడంతో ప్రేక్షకులలో ఆమె ఎవరు అని ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







