కన్నడిగరు యూకే సంస్థ' ఆధ్వర్యంలో ఈనెల 18న లండన్‌లో కన్నడ ఉత్సవం
- September 01, 2017
'కన్నడిగరు యూకే సంస్థ' ఆధ్వర్యంలో ఈనెల 18న లండన్‌లో కన్నడ ఉత్సవం నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు గణేశ్‌భట్ వెల్లడించారు. లండన్‌లో కన్నడిగులు సమైక్యంగా జీవించడం కోసమే 'కన్నడిగరు యూకే' పేరిట సంస్థను ప్రారంభించామని గణేశ్‌భట్ బెంగళూరులో శుక్రవారం ప్రకటించారు. కన్నడ సంస్కృతికి అనుబంధంగా లండన్‌లో తరచూ కార్యక్రమాలు, సినిమాల ప్రదర్శనలు చేపడుతుంటామన్నారు. సమాజ సేవకులకు, ధార్మిక సంస్థలకు తమ వంతు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. పదేళ్లుగా కన్నడ ఉత్సవాన్ని జరుపుతున్నామన్నారు. యూకే వ్యాప్తంగా ఉండే కన్నడిగులందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. కళాకారుడు మండ్య రమేశ్, తుళు ప్రాంత హాస్యకళాకారుడు నవీన్, గాయకుడు గోనాస్వామి, మహదేవ్శెట్టిగిరి, అరళుప్రతిభ, దిశా రమేశ్‌లు పాల్గొంటారన్నారు.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







