అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రద్దు చేసిన కెన్యా

- September 02, 2017 , by Maagulf
అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రద్దు చేసిన కెన్యా

ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కెన్యా సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది. ప్రతిపక్ష నేషనల్ సూపర్ అలయెన్స్ (నాసా)కి అనుకూలంగా తీర్పు వచ్చింది. రెండోసారి అధ్యక్షుడిగా ఉహురు కెన్యట్టా ఎన్నికల్లో విజయం సాధించడంతో అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగి ఉన్నారు. ఎన్నికల ఫలితాలు చెల్లవని తీర్పు రాగానే కోర్టు ఆవరణతోపాటు నైరోబీ మురికివాడల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష నేత రైలా ఒడింగా కోర్టు తీర్పును స్వాగతించారు. ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తులు ఎన్నికల ఫలితాల రద్దుకు మొగ్గుచూపారని చీఫ్ జస్టిస్ డేవిడ్ మరగ తెలిపారు. 

2007 ఎన్నికల సందర్భంగా జరిగిన హింసలో 1100మంది మృతి చెందారు. 2013 ఎన్నికల తర్వాత ఒడింగా కోర్టును ఆశ్రయించి, ఓడిపోయారు. తాజాగా ఈ ఏడాది ఆగస్టు 8న అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత విడుదలైన ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నిరసన ఉద్యమాల్లో 21మంది మృతి చెందారు. ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com