'దుబాయ్ పవనిజం' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవర్ స్టార్ జన్మదిన వేడుకలు
- September 02, 2017
దుబాయ్: పవ నిజం... ఇది బ్రాండ్ కాదు ఒక శక్తి... ఆ శక్తి కి ప్రాణం పోసిన ఒక మహా వ్యక్తి పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముఁడుగా చిత్రసీమకు తెరంగేట్రం చేసినా, అతి తక్కువ కాలంలోనే తన నటనతో మరియు మంచి మనసుతో అశేష అభిమానుల్ని సొంతం చేసుకొని 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో సామాజిక సేవల్లో పాల్గొని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు. రైతన్న కోసం ఆయన పడ్డ తపన దేశదేశాల విస్తరించి ప్రపంచం అన్ని మూలల నుంచి అభిమానులు 'మేము సైతం' అని అండగా నిలిచారు.
సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు ఒక పండగ దినం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినమైన ఈ తేదీన దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం ఘనంగా వేడుకలు జరుపుకుంటారు పవన్ అభిమానులు.
దుబాయ్ లోని పవన్ కల్యాణ్ అభిమాన సంఘం "దుబాయ్ పవనిజం" ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా తమ అభిమాన నటుడి జన్మదిన వేడుకను అభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. దుబాయ్ పవనిజం ప్రెసిడెంట్ ప్రసాద్ పెద్దిశెట్టి మాట్లాడుతూ గత మూడేళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తునట్టు తెలిపారు.ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చెయ్యాలని తెలియజేసారు.అభిమానులు అందరూ కలిసి కేక్ కట్ చేసారు.ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ప్రసాద్ పెద్దిశెట్టి,రవి చల్లా,తులసి ప్రసాద్ ఎరికి, శ్రీకాంత్ చిత్తర్వు,అప్పాజీ,కేసరి త్రిమూర్తులు, సత్యనారాయణ,సింగిరి రవి కుమార్,సింగిరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







