మన రైళ్లకు గొప్పోళ్ళ పేర్లు

- September 03, 2017 , by Maagulf
మన రైళ్లకు గొప్పోళ్ళ పేర్లు

''మీరు ప్రయాణించాల్సిన డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి రైలు తొమ్మిదో నంబరు ప్లాట్‌ఫాంపై వచ్చియున్నది''.. ఈ తరహా అనౌన్స్‌మెంట్‌ను త్వరలోనే మీరు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో విన్నా ఆశ్చర్యం లేదు. అలాగే కోల్‌కతాలో మహాశ్వేతాదేవీ పేరుతో.. పట్నాలో రామ్‌ధారీ సింగ్‌ ధింకర్‌ పేరుతో రైళ్ల పేర్లు మారతాయేమో!! ఏమిటిలా రైళ్లకు కొత్తగా రచయితల పేర్లు అంటారా? దేశంలో విభిన్న ఆచారాలు, సంస్కృతులు, భాషలున్న ప్రాంతాలను కలపడంలో రైళ్లు వారధిగా నిలుస్తున్నాయి. అలాంటప్పుడు విభిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా రైళ్లకు సాహిత్య అకాడమీ తదితర ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించిన రచయితల పేర్లు పెడితే తప్పేమిటి? రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు మదిలో మెదిలిన ఆలోచన ఇది. ఆయన సూచనల మేరకు దేశవ్యాప్తంగా రైళ్ల పేర్లను మార్చేందుకుగాను అధికారులు ప్రతిపాదనల తయారీలో మునిగిపోయారు. రైళ్లకు రచయితల పేర్లు పెట్టే దిశగా ప్రాథమికంగా పనులు ఇప్పటికే మొదలయ్యాయని అధికారులు తెలిపారు. నిజానికి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైళ్లు, స్టేషన్ల పేర్లను మార్చారు.

మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్ ను హిందూ మహాసభ మాజీ అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ మాలవీయ పేరుతో.. అయోధ్య ఎక్స్‌ప్రె్‌సను భారతీయ జనసంఘ్‌ సిద్ధాంతకర్త దీనదయాళ్‌ ఉపాధ్యాయ పేరుతో వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com