అమెరికాలోని లాస్ఏంజిల్స్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు
- September 03, 2017
అమెరికాలోని లాస్ఏంజిల్స్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. లాట్యూనా కెనియన్ లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది. భారీగా చెలరేగిన మంటలు.. చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సమీపంలోని నివాస ప్రాంతాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 5వేల ఎకరాల అటవీ ప్రాంతం మంటల్లో కాలి బూడిదైంది. వందలాది అగ్నిమాపక వాహనాలతోపాటు, హెలికాప్టర్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రమైన మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావణం గరిష్టస్థాయికి చేరిందని అధికారులు తెలిపారు. లాస్ ఏంజిల్స్ చరిత్రలోనే ఇది భారీ అగ్నిప్రమాదమని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







