దుబాయ్ లో ట్రామ్ ప్రయాణించే దారిలో కారుని నడిపి ఇరికించిన అరబ్ డ్రైవర్
- September 03, 2017
' నలుగురికి నచ్చింది...నాకసలే నచ్చదురో... నరులెవరూ నడపని దారిలో నేను నడిపిదేరో.. నిండు చందమామ ఒక వైపు... చుక్కలు ఒకవైపు... పొగరని మీరనుకొన్నా..అది నా మేనరిజమని ' అని ఓ అరబ్ డ్రైవర్ ఆదివారం ఉదయం అందరు ప్రయాణించే మార్గంలో కాక ట్రామ్ వెళ్లే దారిలో తన కారుని నడిపి అక్కడ ఎటువెళ్లలేక ఇరుక్కుపోయాడు. దాంతో దుబాయ్ పోలీసులు ట్రామ్ ప్రయాణించే ట్రాక్ నుంచి ఆ కారును తొలగించేందుకు క్రేన్ సహాయం తీసుకొన్నారు. ఫేస్ బుక్ లోని ఒక క్లోజ్డ్ గ్రూప్ లో ఒక పోస్ట్ లో తెలిపిన సమాచారం ప్రకారం, ట్రామ్ మార్గంలో ఆ కారు 500 మీటర్ల వరకు నడిపి ఆపై నడవకుండా మొరాయించి ఆ ట్రాక్ లో ఇరుక్కుపోయింది. ఈ సంఘటన గురించి పోలీసులకు ఉదయం 5 గంటల సమయంలో తెలిసింది. అయితే అరబ్ డ్రైవర్ తన కారుని ట్రామ్ ట్రాక్ పై ఎందుకు నడిపేరో పోలీసులు పేర్కొనలేదు, కాని ఆ వ్యక్తికి జరిమానా విధించినట్లు ఒక ఉన్నత అధికారి తెలిపారు.దుబాయ్ మెరీనా మాల్ కు ఎదురుగా ఉన్న "ట్రామ్ ట్రాక్ పై " ఒక కారు ఇరుక్కొన్న విషయం గూర్చి తమకు ఓ సమాచారాన్ని అందుకున్నట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజూరు " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి చెప్పారు. ఆ కారును తొలగించడానికి ప్రమాద నివారణ జట్టు "కొంత సమయం" తీసుకున్నారని ఆయన వివరించారు. ట్రాక్ పై కారు ఇరుక్కొన్న సంఘటన ట్రామ్ కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం గాని ప్రభావితం చూపలేదని ,అలాగే అది ఏ ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం కాలేదున్నారు. ఈ తరహా విన్యాసాలు ట్రామ్ ట్రాక్ పైకి రావడం మొదటిసారి కాదు. గతంలో కొన్ని సంఘటనలు జరిగేయి. సెప్టెంబరు 2015 లో, ఒక అరబ్ వ్యక్తి ఆల్ సుఫ్ఫ లో ఎరుపు రంగు ట్రాఫిక్ సిగ్నల్ ను దాటివెళ్లి తన కారును ఒక ట్రామ్ ను ' ఢీ ' కొన్నాడు. గత ఏడాది అక్టోబర్ లో ఆ కేసుకి సంబంధించి దుబాయ్ కోర్టు ఆ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కు ఒక నెలరోజులపాటు జైలుశిక్షతో పాటు 3,000 ధిర్హాంలను జరిమానా విధించి, మూడు నెలల పాటు ఆ అరబ్ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







