'కబాలి' షూటింగ్ కోసం మలేషియా వెళ్ళిన రజని
- October 28, 2015
సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యానియాతో మలేషియా ఎయిర్ పోర్ట్ దద్దరిల్లి పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న 'కబాలి'షూటింగ్ కోసం మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కిన దగ్గర నుంచి ఈహడావిడి ప్రారంభం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీని విమానంలో చూసిన వెంటనే ఆ విమానంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులతో పాటు ఆ విమానాన్ని నడుపుతున్న పైలెట్ కో పైలెట్ తో సహా ఆ విమాన సిబ్బంది అంతా రజనీకాంత్ తో సెల్ఫీలు తీయించు కోవడానికి ఎగబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా రజనీకాంత్ మలేషియన్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే అక్కడ సామాన్య ప్రయాణీకులు కూడ రజినీకాంత్ ను గుర్తుపట్టి రజనీ చుట్టూ చేరడంతో రజినీకాంత్ ను ఆ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు తీసుకు రావడానికి అతడి సన్నిహితులు సినిమా యూనిట్ వారు నానా పాట్లు పడినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ మలేషియా వచ్చిన విషయాన్ని తెలుసుకున్న కౌలాలంపూర్ గవర్నర్ రజినీకాంత్ ను తన గవర్నరు బంగళాకు ప్రత్యేకంగా ఆహ్వానించి రజినీతో లంచ్ చేయడం మలేషియా మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇది చాలదు అన్నట్లుగా రజినీకాంత్ తాను బస చేస్తున్న హోటల్ గది వద్దకు అసంఖ్యాకంగా అభిమానులు గుమిగూడటంతో ఆ హోటల్ సిబ్బందికి రజినీ రాక సమస్యగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి' లో మరో హీరోయిన్ గా నటించడానికి ఐశ్వర్యరాయ్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. రజనీ రిక్వెస్ట్ చేయడంతో ఐశ్వర్య ఈపాత్రకు ఓకె చెప్పిందని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈమె పాత్ర ఈ సినిమా సెకండాఫ్‌లో కనిపిస్తుందని అంటున్నారు. దీనితో ఈసినిమా పై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్‌గా చెన్నైలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తికాగా ఇప్పుడు మలేషియాలో షూటింగ్ మొదలు పెడుతున్నారు. మలేషియాలో రజనీ పై యాక్షన్ సీన్స్‌ని డైరెక్టర్ రంజిత్ తెరకెక్కిస్తున్నాడట. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో రజనీకాంత్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వైపు డాన్‌గా, మరోవైపు పోలీసు ఆఫీసర్‌గా రజనీకాంత్ కనిపిస్తాడట. అసలు విషయాలు తెలియాలి అంటే ఈసినిమా రిలీజ్ వరకు ఆగాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







