మహేష్ బాబును పొగడతలతో ముంచెత్తిన మెగా బ్రదర్ నాగబాబు
- September 03, 2017
హీరోలందు మెగా హీరోలు వేరు... మెగాస్టార్ చిరంజీవి కూడా బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు.. ఇక రామ్ చరణ్ కూడా ఏ హీరో అయిన బేషజలకు పోకుండా.. వారితో కలిసి మెలిసి ఉంటాడని.. సినిమా హిట్ అయితే వెంటనే ఆ హీరోకి ఫోన్ చేసి గ్రీట్ చేస్తాడని చాలా మంది హీరోలు చెబుతూనే ఉంటారు.. తాజా మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోల గురించి ప్రస్తావించారు.. కాగా మహేష్ గురించి నాగబాబు వెల్లడించిన అభిప్రాయం అందరికీ షాక్ ఇస్తుంది.. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు షిఫ్ట్ కాకముందు.. చాలా మంది చెన్నైలో ఉన్నవారే.. ఈ నేపద్యంలో నాగబాబు తాము చెన్నై లో ఉన్నప్పటి నుంచి మహేష్ బాబు తెలుసు అని చెప్పాడు.. అప్పట్లో మహేష్ బాబు చాలా చబ్బీగా ఉండేవాడని.. కానీ హైదరాబాద్ వచ్చాక చూస్తే.. మ్యాన్లీగా మారిపోయాడని చెప్పాడు.. మేము అందరం హైదరాబాడ్ కు షిఫ్ట్ అయ్యాక పార్క్ కి వాకింగ్ వెళ్తే.. పక్కనే మహేష్ పరుగెట్టుకొని వెళ్ళేవాడని... మహేష్ పరుగు రన్నింగ్ అథ్లెటిక్ లా ఉంటుంది. మహేష్ బాబు అంత అందంగా ఎవరూ పరిగెత్తలేరు.. ఊసేన్ బోల్ట్ పరుగెత్తినట్లు పరిగెతాడు.. ఇప్పుడు టాప్ రేంజ్ లో ఉన్న మహేష్ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు.. అయినా ఇప్పటికీ కష్టపడతాడు.. వ్యక్తిగతంగా మహేష్ బాబు కష్టాన్ని చూశాను.. అందుకని ఒకవేళ మహేష్ ను ఏమైనా అనాలి అనుకున్నయ ఎలా అంగలుగుతాం అండి.. మహేష్ బాబు పై నాగబాబు పొగడ్తల వర్షం కురిపించాడు.. మెగా హీరో నోట ప్రిన్స్ గురించి వచ్చిన మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా మెగా ప్రిన్స్ నాగబాబు తనకు మల్టీస్టార్ మూవీ చేయాల్సి వస్తే మహేష్ బాబుతో చేస్తానని వెల్లడించిన సంగతి విధితమే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







