వెడ్డింగ్, ఎంఐసిఇ డెస్టినేషన్‌గా బహ్రెయిన్
- September 04, 2017
మనామా: బహ్రెయిన్‌ని వెడ్డింగ్ మరియు ఈవెంట్స్‌కి సంబంధించి డెస్టినేషన్‌గా మార్చేందుకోసం ఐలాండ్స్, బీచ్‌లు, ఎడారి ప్రాంతాల్ని ప్రమోట్ చేయాలని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. ఇండియాలో ఇటీవలి కాలంలో విదేశాల్లో ఈవెంట్స్ నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈవెంట్స్‌కి కూడా డెస్టినేషన్స్ ప్లానింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే బహ్రెయిన్, ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలనుకుంటోంది. భారత్ నుంచి బహ్రెయిన్‌కి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దరిమిలా, డెస్టినేషన్ టూరిజం సౌకర్యాల్ని మరింత మెరుగుపర్చడం, అలాగే ఆయా ప్రాంతాల్ని ఇంకాస్త ఎక్కువగా ప్రమోట్ చేయడం వంటి వాటి ద్వారా భారతలోని డెస్టినేషన్ లవర్స్‌ని ఆకట్టుకోవాలని చూస్తున్నట్లు బిటిఇఎ వెల్లడించింది. వెయ్యేళ్ళకుపైగానే ఇండియాతో బహ్రెయిన్‌కి సన్నిహిత సంబంధాలున్నాయనీ, డెస్టినేషన్ వెడ్డింగ్స్‌తో ఆ సంబంధాలు ఇంకా బలోపేతం అవుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, ముంబై సహా పలు ముఖ్యమైన నగరాల్లో బహ్రెయిన్ డెస్టినేషన్ గురించిన ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడానికి పలు కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తోంది బిటిఇఎ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







