దుబాయ్ ఫైరిఫైటర్స్ స్పందనతో సెలువు రోజులలో తప్పిన పెను విషాదం
- September 04, 2017
దుబాయ్: ఆమె ఈ వంటగదిలో సిలిండర్ నుంచి గ్యాస్ వెలువడుతున్నట్లు గుర్తించిన ఓ మహిళ వెనువెంటనే స్థానిక అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించింది వారు వెంటనే ప్రమాద స్థలానికి వచ్చి ఆ సమస్యను నివారించారని దుబాయ్ సివిల్ డిప్యూటీ యొక్క సత్వర స్పందన గురించి ఆమె ప్రశంసించారు. ఈద్ ఆల్ ఆదా సెలవుల్లో గురువారం ఉదయం 10 : 30 గంటల సమయంలో ఆ మహిళ తన వంటగదిలో సిలిండర్ నుంచి గ్యాస్ వెలువడుతున్నట్లు గమనించింది. ఊపిరి ఆడనంత పరిస్థితులలో ఆమె తన ఇంటికి ఒక సాంకేతిక నిపుణిడిని పంపమని గ్యాస్ సిలిండర్ పంపిణీదారుడికి చెందిన అత్యవసర నెంబర్ కు ఫోన్ చేసి కోరినట్లు తెలిపారు. సాంకేతిక నిపుణుడు అక్కడకు వచ్చినపుడు గ్యాస్ మరింతగా ఇంటిలోనికి వ్యాపించిందని తెలిపింది. ఈ పరిస్థితిలో అగ్నిమాపక విభాగాన్ని పిలిచారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ అల్ నహడ 2 లో ఆమె ఇంటికి అగ్నిమాపకదళాలను పంపింది. వారు రావడమే అగ్నిమాపక సిబ్బంది ఇంటి నుండి సిలిండర్ను వెంటనే తొలగించారు. అత్యవసర పరిస్థితిలో జోక్యం చేసుకుంది మరియు తక్షణ ప్రమాదంలోకి కారణమైన గ్యాస్ సిలిండర్ ను అక్కడ్నుంచి తొలగించింది. సిలిండర్ పేలుడు ప్రమాదం నుండి తప్పించుకునేల తమను రక్షించారని ఆ మహిళ సంబంధిత శాఖకు కృతజ్ఞత తెలిపింది. "గ్యాస్ పంపిణీదారుడు పంపించిన నిపుణుడు ప్రమాదాన్ని అదుపు చేయలేనప్పుడు నేను దుబాయ్ సివిల్ డిఫెన్స్ అని పిలిచాను. 15 నిమిషాల్లో, వారు (అగ్నిమాపకదళ సిబ్బంది) స్పందించారు,వారు మా ఇంటి నుండి సిలిండర్ ను తొలగించారు. తమ భవనం వెలుపలకు తీసుకువెళ్లారని ఇది ఒక తప్పిపోయిన పెద్ద విపత్తు కావచ్చు, నా కొడుకు మరియు కుటుంబం ఇంట్లో ఉండే సమయాలలో జరిగితే మరింతగా వారు బయపడిపోయేవారని ఆమె తెలిపారు "సుబ్రమణ్యం మాట్లాడుతూ గ్యాస్ పంపిణీదారునికి ఫోన్ ద్వారా పిలిచిన అర్వాత ఐదు గంటల తర్వాత,ఒక సాంకేతిక నిపుణుడు తాపీగా తమ ఇంటికి చేరుకున్నట్లు ఆమె చెప్పారు.
మీరు గ్యాస్ వాసన గుర్తించినప్పుడు కొన్ని భద్రతా చిట్కాలు :
1) తక్షణం ఆ సమీపంలో ఏదైనా ఇతర బహిరంగ జ్వాలలు లేదా ఇగ్నిషన్ కట్టివేయడం మంచిది.
2) సురక్షితంగా ఉంటే, గ్యాస్ వెలువడే వాల్వ్ లను ఆపివేయండి.
3) గ్యాస్ లీకేజ్ ప్రాంతాన్ని ఖాళీ చేయండి.
4) హాని కలిగే పరిస్థితులు ఏర్పడితే తక్షణమే గ్యాస్ పంపిణీదారుని పిలవండి , వారు స్పందించకపోతే, ఫోన్ ద్వారా 999 అత్యవసర అధికారులను సంప్రదించండి.
5) అత్యవసర అధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటికి దూరంగా ఉండండి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







