గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న బొంతు

- September 05, 2017 , by Maagulf
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న బొంతు

హైదరాబాద్‌: నగరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మధ్యాహ్నంలోగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైందని అన్నారు. గత ఏడాది భారీ వర్షాలు పడినా అనుకున్నవిధంగానే నిమజ్జనం చేయడం జరిగిందని, ఈసారి కూడా అలాగే చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు మేయర్ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణేష్ శోభాయాత్ర ప్రారంభమైందని ఆయన తెలిపారు. దీనికి పోలీస్ శాఖ కూడా సహకరిస్తుందని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com