ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్..! బాబుతో భేటీ..!!
- September 06, 2017
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖపట్నం రానున్నారు. అంతేకాక.. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఒకే వేదికపై ఆసీనులు కాబోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఎం ఏపీలో ఓ మీటింగ్ కు హాజరుకాబోతుండడం ఇదే ప్రధమం. ఇంతకూ కేసీఆర్ ఎందుకు ఏపీ వస్తున్నారు..?
తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 16,17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. వైజాగ్ లో జరిగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముగింపు సమావేశానికి ఆయన హాజరవుతున్నారు. ఇదే సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొనున్నారు. వైజాగ్ సమావేశానికి వచ్చేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్టు NGT నిర్వాహకులు తెలిపారు. దీంతో తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఒకే వేదికపై ఆసీనులు కానున్నారు.
ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం. మధురవాడలోని వైజాగ్ కన్వెన్షన్స్ లో ఈ సమావేశం జరగనుంది.
రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు సార్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు. మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లారు. ఇప్పుడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ వస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









