ఇక కతార్ లో ఉద్యోగం మారడం సులభం

- October 28, 2015 , by Maagulf
ఇక కతార్ లో ఉద్యోగం మారడం సులభం

 

కతార్ లో కొత్తగా అమలులోకి వచ్చిన ప్రవాసీయుల ఆగమన, నిగమన, నివాస చట్టం ప్రకారం వారు ప్రభుత్వ అనుమతితో ఒప్పందం గడువు ముగిసిన అనంతరం లేదా ఓపెన్- ఎండెడ్ ఒప్పందాల సందర్భంలో ఐదు సంవత్సరాల అనంతరం ఉద్యోగాలను మార వచ్చును. హిజ్ హైనెస్ ఎమిర్ ష్మ్ తామిం బిన్ హమాద్ అల్-తానీ జారీచేసిన 2015, చట్టం 21 ప్రకారం పాత చట్టంలో యజమానిని సూచించే  పదం 'స్పాన్సర్' కు బదులుగా 'రిక్రూటర్' ను ప్రవేశపెట్టారు. ఒప్పందం ముగియకుండా ఉద్యోగం మారడానికి, ఆర్టికల్ 20 ప్రకారం తన యజమాని, ఆంతరంగిక మంత్రిత్వ శాఖ, మరియు శ్రామిక మరియు సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి పొందాలి. యజమాని మరియు శ్రామికుని మధ్య విభేదాలున్నపుడు, ఆర్టికల్ 22 ప్రకారం, ఆంతరంగిక శాఖా మంత్రి లేదా అతని ప్రతినిధి ఆమోదం ప్రకారం ఇంకొక కొత్త ఉద్యోగంలో చేరావచ్చు. మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా శ్రామికులను మరొక యజమాని వద్ద పనికి పెట్టడాన్ని ఆర్టికల్ 38 నిరోధీస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com