హ్యాకింగ్: 1.8 మిలియన్ దిర్హామ్‌ల ట్రాన్స్ఫర్
- September 06, 2017
దుబాయ్: ఓ హ్యాకర్, అమెరికాకి చెందిన ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి, దుబాయ్‌లోని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీకి పెద్ద మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 2013 మార్చిలో సీటెల్‌లోని బ్యాంక్ అకౌంట్‌ని హ్యాక్ చేసి, 500,000 డాలర్లు (1.3 మిలియన్ దిర్హామ్‌లు) మూడు ఇన్స్టాల్మెంట్స్లో కంపెనీకి చెందిన బ్యాంక్ అకౌంట్‌కి మళ్ళించినట్లు అధికారులు గుర్తించారు. హ్యాకింగ్‌ని గుర్తించిన అమెరికన్, సదరు సంస్థను సంప్రదించి ఆ మొత్తాన్ని తిరిగి తన అకౌంట్‌కి బదలాయించాల్సిందిగా కోరినా, ఆ కంపెనీ అందుకు సమ్మతించలేదు. దాంతో ఆ అమెరికన్, లీగల్ కన్సల్టెంట్‌ని ఆశ్రయించారు. లీగల్ కన్సల్టెంట్ హస్సన్ ఎల్హాఆయిస్ సివిల్ కేస్ వేస్తూ, కంపెనీపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం, 250,000 డాలర్లను బాదితుడికి చెల్లించాల్సిందిగా కంపెనీకి ఆదేశించింది. అలాగే 9 శాతం వడ్డీ చెల్లించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







