1993 ముంబై పేలుళ్ల కేసులో ఇద్దరికి మరణశిక్ష.. ఇద్దరికి జీవిత ఖైదు విధించిన కోర్టు
- September 07, 2017
1993 ముంబైలో వరుస పేలుళ్లతో మారణహోమం సృష్టించి వందల మంది ప్రాణాలను బలితీసుకున్న కేసులో నిందితులకు టాడా కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కరీముల్లా ఖాన్‌కు జీవిత ఖైదు విధించింది. అలాగే అబూ సలెంకు కూడా జీవిత ఖైదు విధించింది కోర్టు. పోర్చుగల్‌తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం శిక్ష జీవితఖైదుకే పరిమితమైంది. పోర్చుగల్‌లో మరణశిక్షలు అమలులో లేకపోవడంతో జీవితఖైదు విధించింది కోర్టు.
పేలుళ్ల కేసులో ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ జూన్ 16, 2017న కోర్టు తీర్పు వెలువరించింది. ముస్తఫా డొస్సా, అబూ సలేం, కరీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ, తహీర్ మర్చంట్‌లను దోషులుగా పేర్కొంది కోర్టు. మరో నిందితుడు అబ్దుల్ ఖయ్యూమ్ ను నిర్దోషిగా పేర్కొంది. జూన్ 28న ప్రధాన దోషి ముస్తఫా డొస్సా గుండెపోటుతో మృతి చెందాడు.
నేరపూరిత కుట్ర, ప్రభుత్వం వ్యతిరేకంగా యుద్ధానికి పిలుపునివ్వటం, హత్య నేరాలు దోషులపై రుజువు అయ్యాయి. తుది తీర్పు సమయంలో దోషుల శిక్ష విషయంలో క్షమాగుణం ప్రదర్శించకుండా కఠిన శిక్షలు ప్రాసిక్యూషన్ కోరింది. ముస్తాఫాతో సహా నలుగురికి మరణశిక్షలు, అబూతోపాటు రియాజ్ కు జీవిత కాల ఖైదు విధించాలని విజ్నప్తి చేసింది. మార్చి 12,1993న జరిగిన పేలుళ్లలో సుమారు 275 మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మారణకాండపై 2300 పేజీలతో కోర్టు తుది తీర్పు చెప్పింది.
ముంబై పేలుళ్ల కేసులో ఇది రెండో దఫా విచారణ. మొదటి దశ విచారణ 2007లో ముగిసింది. అందులో వందమందిని దోషులుగా టాడా కోర్టు తీర్పు వెలువరించింది. మరో 23 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









