చాకచక్యంగా వ్యవహరించిన దుబాయ్ పోలీసులు - తప్పిన ప్రమాదం
- September 07, 2017
ఈరోజు దుబాయ్ లో ఒక అనూహ్యమైన పరిణామం జరగటం అందులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఒక పెను ప్రమాదాన్ని తప్పించిన వైనం వెలుగు చూసింది. దివ్యాంగుడైన ఒక వ్యక్తి తన కార్ డ్రైవ్ చేస్తుండగా హఠాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వటం జరిగింది. ఆందోళన చెందిన దివ్యాంగుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించగా, పోలీస్ వారు తనకు ఫోన్ లో కొన్ని టిప్స్ ఇస్తూ తనను స్పీడ్ కంట్రోల్ చేసేందుకు సాయపడ్డారు. ఈ క్రమంలో 'జనరల్ డిపార్ట్మెంట్ అఫ్ కంట్రోల్ రూమ్' డిప్యూటీ డైరెక్టర్ 'బ్రిగాదీర్ ఒమర్ అబ్దుల్లా అల షాంసీ' దివ్యాంగుడిని తన ముందున్న కార్ నంబర్ చెప్పమని అడిగి తెలుసుకొని ఆ ఎదురు కార్ లో ఉన్నఏమిరాతీ కి కాల్ చేసి దివ్యాంగుని పరిస్థితి వివరించి తన కార్ యొక్క స్పీడ్ ను తగ్గించండం ద్వారా దివ్యాంగుని కార్ తనకు మెల్లిగా ఢీకొంటుందని దానిద్వారా పెను ప్రమాదం తప్పుతుందని వివరించి ఈ సమస్యను ఎంతో సమయాసృహూర్తి తో తప్పించారు. ఇంతలో పోలీసు వారు అక్కడికి రావటం, దివ్యాంగుడిని సురక్షితంగా ఇంటికి చేర్చటంతో అందరు పోలీసు వారి సమయస్ఫూర్తి హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









