శ్రీలంక కుటుంబం ఆత్మహత్యపై షార్జా పోలీసుల విచారణ
- September 07, 2017
షార్జా: శ్రీలంకకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి షార్జా పోలీసులు విచారణ చేపట్టారు. ఐదుగురు కుటుంబ సభ్యుల గల ఆ కుటుంబం, హోటల్ అపార్ట్‌మెంట్‌లోని ఏడో అంతస్తు నుంచి కిందికి దూకేశారు. మొత్తం ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 55 ఏళ్ళ వ్యక్తి, ఆయన భార్య, ఓ కుమారుడు ఈ ప్రమాదంలో మరణించారు. ఇద్దరు కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, గాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించారు. అల్ కువైగ్ హాస్పిటల్‌లో వారికి చికిత్స అందించారు. విజిట్ వీసాపై ఈ కుటుంబం దేశంలోకి వచ్చినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







