'స్మార్ట్ విలేజెస్' గా మారనున్న మన పల్లెలు
- September 07, 2017
ఇక త్వరలోనే అన్ని గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2019 మార్చి నాటికి దేశంలోని 5.5 లక్షల గ్రామాలకు వైఫై సమకూర్చేలా రూ 3700 కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తుదిరూపు ఇస్తోంది. ఇందులో భాగంగా తొలిదశలో 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు వైఫై అందుబాటులో తెచ్చేందుకు ఈ నెలలో టెండర్లు పిలుస్తామని టెలికాం అధికారి ఒకరు వెల్లడించారు. ఇది చాలా పెద్ద లక్ష్యమేనని దేశంలోని అన్ని గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పించాలంటే 5.5 లక్షల గ్రామాలకు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌ను కల్పించాల్సి ఉంటుందని టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ చెప్పారు.
రూ 3700 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో దీన్ని చేపడుతున్నామని ఈ సంవత్సరాంతానికి లక్ష గ్రామ పంచాయితీల్లో సెకనుకు 1000 మెగాబైట్లతో ప్రభుత్వం బ్రాడ్‌బ్యాండ్ సేవలకు శ్రీకారం చుడుతుందన్నారు. భారత్‌నెట్ సర్వీసు ద్వారా వీరికి వైఫై కల్పిస్తామని, ఈ నెట్‌వర్క్ పూర్తయిన వెంటనే దేశంలోని అన్ని గ్రామాలకూ వైఫైని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..









