బహ్రెయిన్: లేబర్ క్యాంప్‌లో కార్మికుల పరిస్థితి దయనీయం
- September 07, 2017
మనామా: అల్ మువాతాసిమ్ అవెన్యూలో కార్మికులు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు. మొత్తం ఆ భవనమంతా దారుణమైన పరిస్థితుల్లో ఉందని కార్మికులు తెలిపారు. కనీసపాటి మరమ్మత్తులు అయినా చేయాలని ఎన్నిసార్లు ల్యాండ్లార్డ్కి చెప్పినా పట్టించుకోలేదని వారు వాపోయారు. నీటిని, కరెంట్నీ కట్ చేసేస్తే తమ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని భావించే ఏమీ చేయలేకపోతున్నామని వారు అన్నారు. సాయంత్రం వేళల్లో కరెంట్, వాటర్ ఎందుకు రావడంలేదని ల్యాండ్లార్డ్ని ఒక్కోసారి ప్రశ్నిస్తే, ఇడబ్ల్యుఎ అధికారులు వాటిని కట్ చేసేస్తున్నారని సమాధానమిచ్చారని ఓ నివాసితుడు తెలిపారు. ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పెరుగుతాయనీ, అందుకే సర్దుకుపోతున్నట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 100 మందికి పైగా కార్మికులు చిన్నపాటి వాటర్ ట్యాంక్ మీద ఆధారపడి ఉంటున్నారక్కడ. అధికారులు మాత్రం ఆ ప్రాంతంలో నీటి సమస్యగానీ, కరెంట్ సమస్యగానీ లేదని చెబుతున్నారు. వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు తగ్గించుకోవడానికి ఓనర్ అలా వ్యవహరిస్తున్నట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







