దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం
- September 07, 2017
దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మెక్సికో తీరంలోని ట్రెస్‌పికోకు 119 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభించింది. పిజిజియాపన్‌కు 123 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన ప్రకంపనలు రావడంతో మెక్సికో సిటీలోని భవనాలు బీటలు వారాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. దాదాపు 90 సెకండ్ల పాటు భవనాలు కంపించాయని స్థానికులు చెబుతున్నారు. భూకంపం కారణంగా ఎనిమిది దేశాలకు సునామీ హెచ్చరికలను జారీచేసినట్లు యూఎస్ వాతావరణ అధికారులు వెల్లడించారు. మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, కోస్టారికా, నిఖరాగ్వా, పనామా, హోండూరస్, ఈక్వెడార్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







