బాలీవుడ్ నటిని ఫోటోలు తీసినందుకు జర్నలిస్ట్ పై దాడి
- September 07, 2017
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఫోటోలు తీసిన ఫోటో జర్నలిస్టులపై హోటల్ బౌనర్స్ దాడి చేశారు. ముంబైలో అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. నటి శిల్పా శెట్టి, భర్త రాజ్‌కుంద్రాతో డిన్నర్ కోసం ముంబై, బంద్రాలోని బస్టైన్ హోటల్‌కు వచ్చారు. ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడున్న ఫోటో జర్నలిస్టులు, ఔత్సాహికులు కెమెరాలు క్లిక్కుమనిపించారు. ఆశ్చర్యమేమిటంటే వారు కూడా ఫోటోలకు ఫోజులిచ్చారు.
అక్కడంతా సజావుగానే గడిసింది. అయితే ఈ జంట కారులోకి వెళ్లి కూర్చోగానే హోటల్ బౌన్సర్లు ఒక్కసారిగా ఫోటో జర్నలిస్టులపై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో సోను, హిమన్షు షిండే అనే ఫోటో జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తతంగం అంతా కెమెరాలో రికార్డు అవ్వడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసిన ఇద్దరి బౌన్సర్లతోపాటు ఫోటో జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







