మికా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థుల స్టడీ టూర్లో అపశృతి
- September 08, 2017
స్టడీ టూర్ ఇద్దరి విద్యార్థుల ప్రాణాలు హరించింది. వివరాల్లోకి వెళితే మికా యూనివర్సిటీకి చెందిన 47 మంది విద్యార్థులు క్రాప్టింగ్ కమ్యూనికేషన్ కార్యక్రమంలో భాగంగా గోవాకు వెళ్లారు. వీరంతా కండోలిం బీచ్‌కు వెళ్లారు. అందరు విద్యార్థులు బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. వీరిలో గుర్రం చెందు సాయి జ్ఞానేశ్వర్, అనూజా సుసాన్ పాల్లు బలంగా వచ్చిన అలల తాకిడిలో కొట్టుకుపోయారు. దీనిని గమనించిని తోటి విద్యార్దులు కేకలు పెట్టడంతో స్థానికుల సాయంతో అంజు మృతదేహాన్ని, 5 గంటల అనంతరం జ్ఞానేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు. విగత జీవులుగా పడి ఉన్న వీరిని చూసి సహచర విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. వీరిద్దరూ ఎంతో తెలివైన వారని, చదువులో బాగా రాణిస్తున్నారని వర్శిటీ అసోసియేట్ డీన్ సిద్దార్థ్ దేశ్ ముఖ్ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









