మార్చురీ లో లేచిన శవం
- September 08, 2017
కేరళ: రెండు సార్లు మరణాన్ని చవిచూసిన రత్నం అనే ఒక పెద్దావిడ ఉదంతం ఇది. కేరళకు చెందిన 51 ఏళ్ల రత్నం రెండునెలలుగా మదురై మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జాండిస్, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమెకు వెంటిలేటర్ మీదే చికిత్సనందించారు. ఇక లాభం లేదని డాక్టర్లు తేల్చేయడంతో.. ఆఖరిరోజులైనా ప్రశాంతంగా ఇంటివద్ద వుంటారనుకుని కుటుంబీకులు ఆమెను అంబులెన్స్ ఎక్కించారు.
అయితే.. శ్వాస ఆడకపోవడం, కదలిక లేకపోవడాన్ని గమనించి.. మరణించినట్లు నిర్ధారించుకున్నారు బంధువులు. కాసేపు ఏడుపులు.. పెడబొబ్బలు. వెంటనే.. మార్చురీకి తరలించి గంటసేపు అక్కడే ఉంచారు. తీరా అంత్యక్రియల కోసం బైటికి తీయబోతే.. తాను బతికే వున్నానంటూ కళ్ళతో సైగ చేసిందామె. మళ్ళీ అందరిలో ఆనందం. షాక్ నుంచి తేరుకుని ఆమెను సెయింట్ జాన్స్ హాస్పిటల్ లోని ఐసీయూలో అడ్మిట్ చేశారు. డాక్టర్లు, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.
దురదృష్టవశాత్తూ ఆ సాయంత్రమే రత్నం 'మళ్ళీ' చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫై చేశారు. ఇలా ఒకే రోజు రెండుసార్లు చనిపోయి 'శవాల గది'లోకెళ్ళి వచ్చిన 'రత్నం' గురించి కేరళలో వింతగా చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







