వణికిస్తున్న ఇర్మా

- September 09, 2017 , by Maagulf
వణికిస్తున్న ఇర్మా

హరికేన్‌ ఇర్మా అగ్రరాజ్యం అమెరికా వైపు దూసుకొస్తుంది. మరి కాసేపట్లో ఫ్లోరిడా తీరాన్ని తాకనుంది. కనివినీ ఎరుగని రీతిలో ఇది బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు ఇప్పటికే ఫ్లోరిడాలోని మూడోవంతు ప్రజలను ఖాళీ చేయించారు. దాదాపు 6.3 మిలియన్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారు కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఫ్లోరిడా గవర్నర్‌ రిక్‌ స్కాట్‌ సూచించారు. ఇప్పటికే దాదాపు 76వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
 
ఫ్లోరిడాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌లు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం విధ్వంసకర తుఫాను ముంచుకొస్తోందని ట్రంప్‌ ట్విటర్‌లో ప్రజలను హెచ్చరించారు. 'ఆస్తి పోతే.. మళ్లీ సంపాదించుకోవచ్చు.. కానీ ప్రాణాలు తిరిగిరావు. వారి భద్రత చాలా ముఖ్యం' అని ట్రంప్‌ అధికారులకు హితవు పలికారు. వీలైనంత త్వరగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆయన సూచించారు.
ఇర్మా ప్రభావంతో గంటకు 209 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ అధికారులు చెబుతున్నారు. 25 సెంటీమీటర్ల నుంచి 51 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మియామి తీర ప్రాంత ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com