మళ్ళీ విదేశాలకు వెళ్ళనున్న జగన్
- September 09, 2017
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పెద్ద కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేర్పించేందుకు ఆయన లండన్ వెళుతున్నారు. తన గైర్హాజరీలో పార్టీ కార్యక్రమాలన్నీ విజయసాయిరెడ్డి నిర్వహిస్తారని సీనియర్ నేతలు జగన్ సమాచారమందించారు. మూడు నెలల వ్యవధిలో జగన్ తన కుటుంబంతో రెండోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మూడు నెలల క్రితం కుటుంబంతో సహా విహారయాత్ర కోసం న్యూజిలాండ్ వెళ్లారు. తాను లేకపోయినా బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఓ వైపు పార్టీ నేతల వలసల ప్రచారం, మరోవైపు వైఎస్సార్ కుటుంబం పేరుతో చేపట్టిన కార్యక్రమం ప్రారంభదశలోనే ఉంది. ఈ దశలో జగన్ విదేశీ పర్యటన ఆ పార్టీ నేతలను కొంచెం గందరగోళానికి గురుచేస్తోంది. అక్టోబర్ నుంచి ప్రారంభించాలనుకుంటున్న పాదయాత్ర కోసం రూట్ మ్యాప్‌ను ఖారారు చేయాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే విజయసాయి రెడ్డి కొంత కసరత్తు చేశారు. పాదయాత్రలో దాదాపుగా వంద నియోజకవర్గాలను కవర్ చేయాలని భావిస్తున్నారు.
పాదయాత్ర సమయంలో ఆయా నియోజకవర్గాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటికే అక్కడినేతలకు సమాచారం అందించినట్లు తెలియవచ్చింది. మొత్తానికి లండన్ పర్యటన తండ్రిగా జగన్‌కు ఆనందం కలిగిస్తున్నా, తిరిగి వచ్చేసరికి పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుకుంటాయోనన్న ఆందోళన మాత్రం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







