"తాను బతికే ఉన్నానని " 19 నెలల పోరాటం తర్వాత స్వదేశానికి ప్రయాణం
- September 10, 2017
కువైట్: ఓ చనిపోయిన వ్యక్తి పేరు ...బతికి ఉన్న వ్యక్తికి ఉండటం ..ఆ ఇద్దరిది ఒకే ప్రాంతం కావడం ఆ భారతీయుడికి పెద్ద శాపం అయింది. వివరాలలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక భారతీయుడు తాను బతికే ఉన్నానని నెలల తరబడి పోరాటం తర్వాత చివరకి తాను పనిచేసే కువైట్ నుంచి ఎట్టకేలకు తన స్వదేశం భారతదేశానికి చేరుకొన్నాడు. 19 నెలల క్రితం...2016 మార్చిలో ఆంధ్రప్రదేశ్ చెందిన నరేష్ తన వార్షిక సెలవులను భారతదేశంలో గడిపేందుకు సిద్ధమై కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు చేరుకొన్నాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశం విడిచి వెళ్లనివ్వకుండా నిరోధించారు. కారణం ఆ పేరు గల ప్రయాణీకుడు ఏనాడో చనిపోయాడు. నీవెవరవని అధికారులు నిలదీసేసరికి నరేష్ నీరుగారిపోయాడు. అనంతరం ఆ వ్యక్తిపై పూర్తి విచారణ తర్వాత, తన పాస్పోర్ట్లో అతికించిన వీసా స్టిక్కర్ అదే పేరుతో ఉన్న మరొక వ్యక్తిధీ అని అతను మరణించాడని అదే పేరుతో మరో వ్యక్తి సజీవంగా ఉన్నట్లు కువైట్ అధికారులు తేల్చారు. విమాన ప్రయాణానికి సిద్ధమైన వ్యక్తి మరణించిన వ్యక్తి కాదని రుజువు చేయటానికి 19 నెలలకాలం పట్టింది. త.ఈ సంఘటన ప్రతి ప్రవాసీయునికి ఒక హెచ్చరికను ఇస్తుంది వారి పాస్పోర్ట్ లో వివరాలు సరైనవి కాదా అని తెల్సుకొని అతికించిన వీసా స్టిక్కర్ వివరాలను తనిఖీ చేసుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







