అబుదాబిలో 'బతుకమ్మ' సంబరాలకు అందరూ ఆహ్వానితులు
- September 10, 2017
అబుదాబి: తెలంగాణా సంస్కృతి సంప్రదాయాల కు ప్రతీక మన బతుకమ్మ ఉత్సవాలు. గత సంవత్సరం లో మీ రందరు ఇచ్చిన ప్రోత్సాహం తో రెట్తిపైన ఉత్సాహం తో ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలు అబుధాబీ నగరం లోని ఇండియా సోషల్ సెంటర్ లో ఈ నెల (సెప్టెంబర్) 22 వ తేదీన ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడమైనది. ఈ కార్యక్రమానికి మనలందరిని అలరించడానికి ఈ మధ్య బ్లాక్ బస్టర్ సినిమా " ఫిదా" సహాయ నటి " శరణ్య ప్రదీప్ (వదినమ్మ) " అబుధాబీ కి వస్తున్నారు.మన ఆడపడుచుల బతుకమ్మ ఆట పాటలే కాకుండా, తెలంగాణా జానపద నృత్యాలు మరియు చిన్నారి పిల్లల తెలంగాణా నృత్యాలు మనలందరిని ఆనందింప చేస్తాయి.చిన్నారులకు సాంప్రదాయ వస్త్రలంకరణ పోటీలు నిర్వహించడం జరుగుతుంది.అందంగా అలంకరించి వచ్చిన బతుకమ్మలకు మరియు సాంప్రదాయ వస్త్రాలంకరణ లో గెలుపొందిన చిన్నారులకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.బతుకమ్మ ల నిమజ్జన అనంతరం విందు భోజనం ఏర్పాటు చేయడం అయినది.వేదిక - ఇండియన్ సోషల్ సెంటర్, అబూదాబీ తేదీ - 22 సెప్టెంబర్, 2017 (శుక్రవారం) సమయం : మ: ౩:౩౦ నుండి 7:30 వరకు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







