రోహింగ్యా బాధితులకు యూఏఈ నాయకులు అత్యవసర సహాయ చర్యలు
- September 10, 2017
యూఏఈ: మయన్మార్ వాయవ్య ప్రాంతం లోని రోహింగ్యా బాధితులకి యుఎఇ నాయకులు అత్యవసర సహాయాన్ని అందించనున్నారు. షైక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, హిస్ హైనెస్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు, షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ యుఎయు సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు హిజ్ హైనెస్ షేక్ హమ్దాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, పశ్చిమ ప్రాంత ప్రాంతంలో రూలర్ ప్రతినిధి మరియు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్, ఈఆర్సీ ,ఛైర్మన్లు రోహింగ్యా బాధితులకు తక్షణ సహాయం అందించారు. సైనిక చర్యలలో భాగంగా దాదాపు 400 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. రఖినేప్రావిన్స్లో సైనిక స్థావరం, పోలీస్ పోస్టులపై గత వారం రోహింగ్యా మిలిటెంట్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మయన్మార్ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో భద్రతా దళాలకు,తీవ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 370 మంది రోహింగ్యాలు మరణించగా, 13 మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు ప్రభుత్వ అధికారులు, 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అయితే తమపై కొనసాగుతున్న హత్యలు, దాడులు, లూటీలతో తాము బంగ్లాదేశ్‌కు వలస పోతున్నామని రోహింగ్యా ముస్లింలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో గత నెల 31వ తేదీ నాటికి మొత్తం 38 వేల మంది మయన్మార్ సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లో ప్రవేశించినట్లు ఐరాస అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఉగ్రవాదుల కార్యకలాపాలకు తెరదించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని మయన్మార్ సైన్యం చెబుతుండగా తాము పౌరులకు భద్రత కల్పిస్తున్నామని భద్రతా దళాలుచెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ సైనిక చర్యల కారణంగా వందల సంఖ్యలో రోహింగ్యా ముస్లిం లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో మానవతావాద చర్యలతో ఉపశమన సహాయం అందించడానికి యూఏఈ ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఏ వివక్ష లేకుండా ప్రపంచవ్యాప్తంగా అవసరం ఉన్నవారికి, మరియు రోహింగ్య మైనారిటీ ప్రజలకు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు సహాయం కోసం తమ సహాయ సహకారాలు, మరియు మయన్మార్‌లో ప్రభావితం కాబడినవారికి సహాయం అందించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









