ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ
- September 11, 2017
స్పెయిన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూజర్ల డేటాను ప్రకటనకర్తలకు అందుబాటులో లేకుండా నిరోధించడంలో విఫలమైనందుకు ఫేస్‌బుక్‌కు 1.2 మిలియన్ డాలర్ల జరిమానా విధించినట్టు స్పెయిన్‌కు చెందిన డేటా ప్రొటెక్షన్ సంస్థ తెలిపింది. ఫేస్‌బుక్ తమ యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని, వారికి తెలుపకుండా ఆ సమాచారాన్ని ఎలా వినియోగిస్తుందని స్పానిష్ ఏజెన్సీ ఓ ప్రకటనలో ప్రశ్నించింది. ఫేస్‌బుక్ ప్రైవసీ పాలసీ నిర్థిష్టంగా లేదని, అస్పష్ట నిబంధనలతో కూడిఉందని ఇది, యూజర్ల సమాచార సేకరణకు తగిన విధంగా లేదని మండిపడింది.
తమ దేశ సమాచార పరిరక్షణ నిబంధలను ఉల్లంఘించినందుకు, ఇతర ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఫేస్‌బుక్‌కు జరిమానా విధించినట్టు వెల్లడించింది.ఫేస్‌బుక్‌కు గతంలో ఫ్రాన్స్‌కు చెందిన డేటా ఏజెన్సీ కూడా తమ యూజర్ల డేటాను కాపాడటంలో విఫలమైందని 1,50,000 యూరోల జరిమానా విధించింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







