మిస్ అమెరికా-2018 కారా ముంద్
- September 11, 2017
వాషింగ్టన్: మిస్ అమెరికా-2018 పోటీలు ఆదివారం రాత్రి జరిగాయి. సుమారు 50 మంది పాల్గొన్న ఈ పోటీలో మిస్ నార్త్ డకోటా భామ కారా ముంద్ మిస్ అమెరికా-2018 కిరీటాన్ని దక్కించుకుంది. 23 కారా బ్రౌన్ విశ్వవిద్యాలయంలో వ్యాపార రంగానికి సంబంధించిన చదువును అభ్యసిస్తోంది. నార్త్ డకోటా నుంచి తొలిసారి మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న యువతిగా కారా ముంద్ చరిత్ర సృష్టించింది.
పోటీల్లో భాగంగా న్యాయనిర్ణేతలు 'పారిస్ వాతావరణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం సరైన నిర్ణయమా? కాదా?' అని అడిగిన ప్రశ్నకు కారా ఏమాత్రం తడబడకుండా 'ట్రంప్ నిర్ణయం సరైంది కాదు' అని సమాధానమిచ్చింది. ఈ పోటీల్లో మిస్సోరి భామ జెన్నిఫర్ డేవిస్ తొలి రన్నరప్‌గా నిలవగా, న్యూజెర్సీ భామ కైట్లియన్ ష్కోఫియల్ రెండో రన్నరప్‌గా నిలిచింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







