మహానుభావుడు ఆడియో రిలీజ్ కు బాహుబలి

- September 12, 2017 , by Maagulf
మహానుభావుడు ఆడియో రిలీజ్ కు బాహుబలి

 యంగ్ హీరో శర్వానంద్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మహానుభావుడు. భలే భలే మొగాడివోయ్, బాబు బంగారం సినిమాలతో రూట్ మార్చిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దసరా భారీలో జై లవ కుశ, స్పైడర్ చిత్రాల రిలీజ్ సమయంలో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

స్పైడర్ రిలీజ్ అయిన రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 29న ఈ సినిమాను మహానుభావుడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్థాయిలో ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడట. మహానుభావుడు సినిమా ప్రభాస్ సన్నిహితులకు సంబంధించిన యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. దీంతో ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఓకె చెప్పాడని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com