డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఆమిర్
- September 12, 2017
ఆమిర్ ఖాన్ మంచి నటుడు, దర్శకుడు, వైవిధ్య చిత్రాల నిర్మాత. వీటికి అదనంగా మరో విభాగంలోకి అడుగుపెడుతున్నాడు. అదే సినీ పంపిణీ రంగం. అవును సినిమాల పంపిణీ రంగంలోకి మిస్టర్ పర్ఫెక్ట్ అడుగుపెట్టబోతున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే... డిస్ట్రిబ్యూషన్లోనూ ఓ చెయ్యి వేయాలని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఈ సంస్థ ద్వారా కాన్సెప్ట్ ఆధారిత సినిమాలను పంపిణీ చేయాలని అనుకుంటున్నాడట ఆమిర్. రెడ్ చిల్లీస్ ద్వారా ఇప్పటికే షారుఖ్ ఖాన్ పంపిణీ రంగంలో ఉన్నాడు. ఇప్పుడు ఆమిర్ రాబోతున్నాడు. దీంతో అక్కడ కూడా ఖాన్ల పోటీ నెలకొనబోతోందా అని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.
సినిమాల విషయానికొస్తే... ఆమిర్ ఖాన్ కీలకపాత్రలో నటించిన 'సీక్రెట్ సూపర్‌స్టార్' వచ్చే నెల 19న విడుదలవుతోంది. దీంతోపాటు 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'లో ఆమిర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రధారి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







