ఓ 18 ఏళ్ల యువకుడు బెల్జియం మేయర్ గొంతు కోసి హత్య చేసాడు
- September 12, 2017
బెల్జియంలో ఘోరం జరిగింది. తన తండ్రి చావుకు కారణమయ్యాడనే ఆగ్రహంతో ఏకంగా ఓ మేయర్‌ను హత్య చేశాడు ఓ 18 ఏళ్ల యువకుడు. అత్యంత దారుణంగా ఆయన గొంతుకోసి స్మశాన వాటికలో పడేశాడు. ఈ సంఘటన బెల్జియంలో తీవ్ర కలకలం రేపింది. ఆల్ఫ్రడ్ గడెన్నె(71) మేయర్ ముస్క్రాన్లోని తన నివాసం సమీపంలోని శ్మశాన వాటిక వైపు నడుచుకుంటూ వెళుతుండగా ఈ దాడి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు ఆయనపై కక్షతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 60 వేల మంది ఉండే ముస్క్రాన్ ప్రాంతం ఫ్రాన్స్ సరిహద్దకు సమీపంలో ఉంటుంది. 2015లో ఓ ఉద్యోగిని ఆల్ఫ్రడ్ బాధ్యతల నుంచి తొలగించడంతో అవమాన భారంతో అతడు చనిపోయాడట. ఇప్పుడు అతడి కుమారుడే మేయర్‌పై కక్షతో ఈ దాడికి పాల్పడ్డాడని అంటున్నారు. అత్యంత దారుణంగా ఆయన కత్తితో ఆయన గొంతు కోసి హత్య చేసి చంపినట్లు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









