రజని సినిమాలో ముంబై స్ట్రీట్ బాయ్స్
- September 12, 2017
ధారావీ...! ముంబైలో ఉండే ఈ ఏరియాపేరు దాదాపు భారత దేశం మొత్తం తెలుసు. పాత డిటెక్టివ్ నవలల్లో వర్ణించే స్లం వాతావరణానికి దగ్గరగా ఉండే ఏరియా అది. చాలా రఫ్ పర్సనాలిటీలు ఉంటాయి.., నేరస్తుల శాతం కూడా ఎక్కువే అనే ఒక అపప్రద ఉంది కానీ అది కేవలం నేరస్తుల అడ్డా మాత్రమే కాదు చాలా రకాల ప్రజలు అక్కడ జీవిస్తుంటారు.
1
పాత నేరస్తుల అడ్డా అన్న మార్క్
దిగువ మధ్య తరగతి జీవితాలు అక్కడ కనిపిస్తాయ్... అల్లరి గ్యాంగులు కొన్ని సంవత్సరాల కిందటి వరకూ కనిపించేవి గానీ ఇప్పుడు ఆపరిస్థితి లేదు అక్కడా ఇంకా అదే పాత నేరస్తుల అడ్డా అన్న మార్క్ తో ఉండి పోయిన ధారావీ లో చాలానే విషయాలున్నాయ్... ముఖ్యంగా ఓ ర్యాప్ గ్రూప్ చాలా ఫేమస్.
2
చాలామంది అభిమానులు ఉన్నారు
ఆ గ్రూప్‌లో ఉన్నది నలుగురే. టీవీ షోస్, స్ట్రీట్ షోస్‌లో ఈ ర్యాప్ గ్రూప్ చేసే సందడికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇంగ్లిష్, హిందీ, తమిళ, మరాఠీ, మలయాళం భాషల్లో ఈ గ్రూప్ సాంగ్స్ తయారు చేసి, పాడుతుంటారు. ఈ ర్యాప్ గ్రూప్‌కి ఓ జాక్‌పాట్ తగిలింది.
3
'కాలా'లో ఛాన్స్
ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'కాలా'లో ఛాన్స్ దక్కింది. చిత్రదర్శకుడు పా. రంజిత్ వీళ్లను హిప్ హాప్ గ్రూప్‌గా సినిమాలో చూపించనున్నారు. ఈ సన్నివేశాల్లో వచ్చే పాటకు ఈ ర్యాప్ గ్రూప్ ట్యూన్ కూడా రెడీ చేసింది. అంతా ఓ కలలా అనిపిస్తోన్న ఈ గ్రూప్‌కి రజనీకాంత్‌ని కలవడం ఓ స్వీట్ షాక్‌లా అనిపించిందట.
4
టోనీ సెబాస్టియన్
షూటింగ్ స్పాట్లో రజనీ సార్‌ని కలసినప్పుడు నోట మాట రాకుండా ఆయన్ను చూస్తూ ఉండిపోయామని ర్యాప్ గ్రూప్‌లో ఒకరైన టోనీ సెబాస్టియన్ చెప్పాడు. సూపర్‌స్టార్ రజనీ సార్ సినిమాలో ఛాన్స్ రావడం మాకు ఆనందంగా ఉందన్నారు. అప్పటివరకూ ఒక నార్మల్ ర్యాప్ గ్రూప్‌గానే ఉన్న తమకి ఇలా రజినీ సినిమాలో చాన్స్ రావడం మీద చాలా అనందం వ్యక్తం చేసారు..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







