వరుస షూటింగుల్లో బిజీ గా ఉన్న అల్లు అర్జున్
- September 13, 2017
ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాని లైన్లో పెట్టేసే బన్నీ ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్లో పడ్డాడు. 'నా పేరు సూర్య' తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయాలా? అనే ఆలోచనలో ఉన్నాడు అల్లు అర్జున్.
'దువ్వాడ జగన్నాథమ్' తర్వాత ఆ వెంటనే 'నా పేరు సూర్య' చిత్రాన్ని మొదలుపెట్టేశాడు అల్లు అర్జున్. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్. సీనియర్ హీరోలు అర్జున్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరు అర్జున్‌ల మధ్య అన్నపూర్ణ స్టూడియోస్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఊటీ, బ్యాంకాక్‌లో బన్నీ సినిమాకి వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌తో షూటింగ్ పూర్తి చేసుకోనుంది.
గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న బన్నీ ఈ ఇయర్ ఎండ్‌కి 'నా పేరు సూర్య' పూర్తి చేస్తాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. లింగుసామి దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయాల్సి ఉన్నా ఆ చిత్రం గురించి కొత్త అప్ డేట్స్ ఏమీ లేవు. బన్నీతో సినిమా అనగానే అటు బన్నీతో పాటు అరవింద్ కూడా ఎంటర్ అవుతుండటంతో సక్సెస్ ఫుల్ దర్శకులు కథలతో మెప్పించటం కష్టతరంగా మారిందంటున్నారు.. ఈ నేపథ్యంలో బన్నీకి వెంటనే డైరకెక్టర్ సెట్ కావటం కష్టంగా మారింది. మరి బన్నీ తర్వాతి ప్రాజెక్ట్‌పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







