'మంచోడు' చైతు

- September 13, 2017 , by Maagulf
'మంచోడు' చైతు

అక్కినేని నాగచైతన్య తాజాగా 'యుద్ధం శరణం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చైతూ.. మారుతి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు.

ఈ సినిమాకి 'మంచోడు' అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు చిత్రవర్గాల సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే.. డిసెంబర్‌లో చిత్రీకరణప్రారంభం అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com