సౌతాఫ్రికా కామన్‌వెల్త్ క్రీడల్లో తెలుగు యువతికి స్వర్ణం
- September 13, 2017
సౌతాఫ్రికాలో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో మంగళగిరి యువతి చంద్రిక వెయిట్ లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రిక తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందగా.. అమ్మమ్మ దగ్గరే పెరుగుతోంది. చదువుతోపాటూ, వెయిట్ లిఫ్టింగ్‌లో కూడా ఆసక్తి పెంచుకున్న చంద్రిక అందులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. చంద్రికకు పోషకాహారం అందించే స్తోమత లేకపోయినా.. క్రీడల్లో రాణించిందని ఆమె అమ్మమ్మ తెలిపారు. తగిన ప్రోత్సాహం అందిస్తే దేశానికి మరిన్ని పతకాలు తెచ్చిపెడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రిక కష్టాన్ని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఈనెల 19న సౌతాఫ్రికా నుంచి మంగళగిరి వస్తున్న చంద్రికకు భారీ ర్యాలీతో స్వాగతం పలికేందుకు, ఘనంగా సన్మానించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







