తెలంగాణాలో నేడు, రేపు ముస్లిం మహిళలకు ఇంటర్వ్యూలు

- September 13, 2017 , by Maagulf
తెలంగాణాలో  నేడు, రేపు ముస్లిం మహిళలకు ఇంటర్వ్యూలు

తెలంగాణ విదేశీ ఉద్యోగ కల్పన సంస్థ (టామ్‌కామ్‌) వారు సౌదీ అరేబియాలోని ప్రఖ్యాత కంపెనీ కోసం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మక్కామదీనాలో జానీటర్స్‌గా పనిచేసేందుకు ముస్లిం మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 30-45 సంవత్సరాల లోపు వయస్సు గల ముస్లిం మహిళలు అర్హులుగా తెలిపారు. నెలసరి జీతం సౌదీ అరేబియా సిరాల్‌ (ఎస్‌.ఆర్‌) 1500 అనగా భారతీయ కరెన్సీ ప్రకారం నెలకు రూ.25,500 జీతం ఉంటుందన్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో మల్లేపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ కాంప్లెక్స్‌లోని టామ్‌కామ్‌ కార్యాలయంలో ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు, పూర్తి వివరాల కోసం ఫోన్‌ నంబర్లు 7997973358, 7997973346లో సంప్రదించాల్సిందిగా సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com