అమరావతి డిజైన్ ఎంపికలో జక్కన సలహాలు తీసుకోనున్న సీఎం

- September 14, 2017 , by Maagulf
అమరావతి డిజైన్ ఎంపికలో జక్కన సలహాలు తీసుకోనున్న సీఎం

అమరావతి డిజైన్ల ఖరారులో జక్కన్న కీలక పాత్ర పోషించనున్నారు. బాహుబలితో ప్రపంచానికి తన క్రియేటివిటీని కళ్లకు కట్టిన రాజమౌళి అమరావతి భవనాల డిజైన్లలో కూడా ఒక చెయ్యి వెయ్యనున్నారు. రాజధాని భవనాల డిజైన్లు రూపొందిస్తున్న నార్మన్ ఫోస్టర్ సంస్థకు అవసరమైతే రాజమౌళి బృందంతో సలహాలు, సూచనలు ఇప్పించాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. డిజైన్లు అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఆయన్ను లండన్‌ కూడా పంపించి.. మార్పులు చేర్పులకు  సిద్ధమవుతోంది.

అమరావతిలో ఈనెల 30న తలపెట్టిన అసెంబ్లీ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. తుది డిజైన్లు ఖరారైన తర్వాత శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నిన్న నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు తమకు చూపించిన అసెంబ్లీ డిజైన్లకు చంద్రబాబు స్వల్ప మార్పులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com